Skip to content
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన విశాల్ Telugu News

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన విశాల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి కోలీవుడ్ ప్రముఖులంతా ఒక్కొక్కరిగా వెళ్లి ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తూనే ఉన్నారు. తాజాగా విశాల్ తన స్నేహితుడు అయిన సీఎం విజయ్‌ని కలిశారు. ఈ మేరకు ఆయన ఈ భేటీ గురించి పోస్ట్ చేశారు. ‘లయోలా కాలేజీలో మన పరిచయం ఏర్పడిన నాటి నుంచి నేను మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుస్తూనే ఉన్నాను.. అందులో ఎలాంటి మార్పు రాలేదు. ఓ సాధారణ హీరోగా మొదలైన మీ ప్రయాణంలోని అన్ని అడ్డంకులను, విమర్శలను ఎదుర్కొని, మీ మౌనంతో, విజయంతో వాటన్నిటినీ పక్కకు నెట్టేశారు. ఒక సూపర్‌స్టార్‌గా మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈనాడు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి…

Read more
జూన్ 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘థాంక్యూ సుబ్బారావు’ Telugu News

జూన్ 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘థాంక్యూ సుబ్బారావు’

‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు సంపాదించుకున్న క్రేజ్, మంచి పేరు గురించి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రానున్న సరికొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు. ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మించారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి హైప్ ఏర్పడింది. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు’ని…

Read more
‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. – నిహారిక కొణిదెల Telugu News

‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. – నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ముఖ్య పాత్రలను పోషించారు. ‘బిచ్చగాడు’ తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మేరకు సోమవారం నాడు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ…

Read more
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ మూవీ తెలుగులో రీలీజ్ Telugu News

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ సినిమాని తెలుగులో రీలీజ్ చేయనున్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్

డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే మైలురాయి లాంటి చిత్రాల్లో ‘బిచ్చగాడు’ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. దర్శకుడు శశితో ‘బిచ్చగాడు’ తరువాత మళ్లీ విజయ్ ఆంటోని చేసిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పించిన ఈ మూవీని సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించారు. మానవ సంబంధాలు, ఊహించని మలుపులు, ఆకట్టుకునే డ్రామాతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాని రూపొందించారు. బ్లాక్‌బస్టర్ చిత్రాలను పంపిణీచేస్తూ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యానర్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో…

Read more
రాధాకృష్ణన్ పార్తిబన్ చేతుల మీదుగా ‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ విడుదల Telugu News

రాధాకృష్ణన్ పార్తిబన్ చేతుల మీదుగా ‘ఫీల్ మై లవ్’ టైటిల్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన తమిళ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఈ సారి ఓ అద్భుతమైన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌‌గా రూపొందిన ‘ఫీల్ మై లవ్’ చిత్రాన్ని నిర్మించారు . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. జీవితంలో ఏ క్షణంలోనైనా అద్భుతం జరగొచ్చు అనే కాన్సెప్ట్‌తో రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఫీల్-గుడ్ కథనం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా…

Read more
‘హిట్ అండ్ రన్’ చిత్రం నుంచి  నటాషా సింగ్ లుక్  రిలీజ్ Telugu News

‘హిట్ అండ్ రన్’ చిత్రం నుంచి నటాషా సింగ్ లుక్ రిలీజ్

సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. క్రైమ్, థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ సినిమాను శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌ల మీద సతీష్ రెడ్డి అల్లం, కె. శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంజయ్ రావ్ పాత్ర, ఫస్ట్ లుక్ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ‘హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. తాజాగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ‘హిట్ అండ్ రన్’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్‌ను…

Read more
‘థాంక్యూ సుబ్బారావు’ ఫస్ట్ లుక్‌, టీజర్ రిలీజ్ Telugu News

‘థాంక్యూ సుబ్బారావు’ ఫస్ట్ లుక్‌, టీజర్ రిలీజ్

‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ 'రేపు ఉదయం పది గంటలకు' వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో రానున్న సరికొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు. ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్‌ను గమనిస్తే ఎన్నో అంశాలను మేళవంచి తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి…

Read more
‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల Telugu News

‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, పోస్టర్లు ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస…

Read more
‘మొహబ్బత్’ చిత్రం ప్రారంభం Telugu News

‘మొహబ్బత్’ చిత్రం ప్రారంభం

సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తూ మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ గారు క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ గారు చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా లాంచ్ చేశారు. చిత్రయూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .…

Read more
‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – వీఎన్ ఆదిత్య Telugu News

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – వీఎన్ ఆదిత్య

‘మన డాక్టర్ బాబే’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లా ఉంటుంది - టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ స్కంద శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు టీజర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌‌కు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ‘‘మన డాక్టర్ బాబే’ టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ఇలాంటి మంచి కామెడీ సినిమాలు…

Read more