Skip to content

హీరో ఆది చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ నుంచి ‘ఆనందాల వేళ’ అంటూ సాగే పాట విడుదల

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ అందరినీ మెప్పించాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మరో పాటను రిలీజ్ చేశారు.

‘ఆనందాల వేళ’ అంటూ సాగే పాటను లవ్లీ హీరో ఆది విడుదల చేశారు. లిరికల్ వీడియోని వీక్షించి చిత్రయూనిట్‌ను అభినందించారు. ప్రామిసింగ్ ఉందని, టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ పాటకు చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల గాత్రం.. మణిశర్మ బాణీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేసేలా ఈ పాట కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్‌ను గమనిస్తే ఇదొక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా అని అర్థం అవుతోంది. అన్ని రకాల అంశాలను జోడించిన ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి జిజ్జు సన్ని (పార్కింగ్ ఫేమ్) కెమెరామెన్‌గా పని చేశారు. ఇక ఈ మూవీని జూలై 10న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తారాగణం : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి, జాన్ విజయ్, మైమ్‌ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: రెయిన్‌బో సినిమాస్
నిర్మాత: ధనలక్ష్మి బాదర్ల
రచయిత & దర్శకుడు: వైకుంఠ్ బోను
సంగీతం: మణిశర్మ
DOP: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్)
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్, శ్రీ హర్ష ఈమని
ఫైట్స్: రామకృష్ణ
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.