అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార…
పోసాని కృష్ణ మురళి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ ట్రైలర్ విడుదల
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ చిత్రం అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17న థియేటర్లలో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ, “ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను” అని తెలిపారు.

