Skip to content

విజయవాడలో ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ ఫోర్త్ సింగిల్ ‘హొయిలా హొయిలా..’ రిలీజ్

  హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
– “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మనసుకు హత్తుకుంటుందని పాటలతోనే తెలుస్తోంది – డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
– ప్రేమలోని మంచి కాన్సెప్ట్ లను “చెన్నై లవ్ స్టోరీ” సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
– “చెన్నై లవ్ స్టోరీ” సినిమా మీ మనసులు గెలుచుకుంటుంది – స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్
– ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం “చెన్నై లవ్ స్టోరీ” – ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
– స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు, ఆ ఇద్దరూ మీకు స్నేహితులు అవుతారు – హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ
– వెండితెరపై మునుపెన్నడూ చూడని ప్రేమ కథను “చెన్నై లవ్ స్టోరీ”లో చూస్తారు – హీరో కిరణ్ అబ్బవరం
విజయవాడలో ప్రేక్షకుల కేరింతల మధ్య హీరో కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ” మూవీ లవ్ కార్నివాల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఏపీ డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జనసేన పార్టీ నుంచి పంచకర్ల సందీప్ అతిథిగా హాజరయ్యారు. రాజ్ యువరాజ్ థియేటర్ లో జరిగిన ఈ ఈవెంట్ లో “చెన్నై లవ్ స్టోరీ” సినిమా నుంచి నాలుగో లిరికల్ సాంగ్ ‘హొయిలా హొయిలా’ రిలీజ్ చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ తిరుపతిలో చేశాం. ఈ ఈవెంట్ వైజాగ్ లో చేయాల్సిఉండేది. వర్షం కారణంగా విజయవాడకు వెన్యూ మారింది. ఈవెంట్ మా సొంతూరు విజయవాడకు రావడం నాకు హ్యాపీగా అనిపిస్తోంది. తెలుగులో ఎన్నో ప్రేమ కథలు చూశాం. కానీ “చెన్నై లవ్ స్టోరీ” ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ నెల 24న మా మూవీలోని మ్యాజిక్ తెరపై చూస్తారు. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం చాలా కష్టపడతుున్నారు. 60 గంటలు నాన్ స్టాప్ గా షూటింగ్ చేశారు. గత పది రోజులుగా రెస్ట్ తీసుకోవడం లేదు. అందుకే ఆయనను కిరణ్ బంగారం అని పిలవాలని అనిపిస్తుంటుంది. మా హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ఈ చిత్రంతో మరింత మంచి పేరు తెచ్చుకుంటుంది. రవి నంబూరి కొత్త దర్శకుడిగైనా సినిమాను బాగా తెరకెక్కించారు. ఆయన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ బిజీలో ఉండి ఈవెంట్ కు రాలేకపోయారు. నా విజయాల వెనక నా స్నేహితులు సాయి రాజేశ్, ఎస్ కేఎన్ ఎప్పుడూ ఉంటారు. అన్నారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం. మా మూవీ ఈవెంట్ ఇక్కడ మీ మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. “చెన్నై లవ్ స్టోరీ” సినిమాలోని పాటలను, టీజర్ ను ఇక్కడ మీ మధ్య చూస్తుంటే ఎమోషనల్ గా అనిపించింది. ఈ సినిమా కోసం మేము ఏడాదిన్నరగా కష్టపడుతున్నాం. మరో 20 రోజుల్లో సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ నెల 24న మళ్లీ ఇదే థియేటర్ లో మనమంతా కలుసుకుందాం. స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు. స్టీవెన్ , నిధి ఇద్దరూ మీ అందరికీ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. ఈ చిత్రంలో కిరణ్ తో కలిసి నటించడం లవ్ లీ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అన్నారు.
జనసేన పార్టీ నేత పంచకర్ల సందీప్ మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” సినిమా పేరులోనే చెన్నై ఉందిగానీ ఎక్కువ షూటింగ్ మన చీరాల బీచ్ లోనే చేశారు. డైరెక్టర్ సాయి రాజేశ్ గారు ఇలాంటి మంచి ప్రేమ కథలు మరిన్ని రాయాలి. గొప్ప ప్రేమ ఎలా ఉంటుందో ఈతరం యువతకు తెలిసేలా చేయాలి. ఇదే థియేటర్ లో మనమంతా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా చూద్దాం. ఈ సినిమాకు మన పవర్ స్టార్, డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి ఆశీస్సులు కూడా ఉంటాయని కోరుకుంటున్నా. అన్నారు.
స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ – నా ఫస్ట్ మూవీ హృదయకాలేయం సక్సెస్ మీట్ ఇదే థియేటర్ లో చేసుకున్నాం. అలాగే బేబి సినిమా ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. మా మూవీ టైటిల్ లో చెన్నై ఉంది కానీ వైజాగ్, చీరాలలో ఎక్కువగా షూటింగ్ చేశాం. ఇక్కడ పర్మిషన్స్ కానీ వర్కర్స్ తో వర్క్ గానీ చాలా స్మూత్ గా ఎలాంటి ఆటంకాలు లేకుండా  జరిగింది. కందుల దుర్గేష్ గారు సినీరంగ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. నేను ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ ట్రెజరర్ గా ఉన్నాను. మన దగ్గర మంచి లొకేషన్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది. అందుకే విజయవాడ కేంద్రంగా మరో తెలుగు చిత్ర పరిశ్రమ రావాలని కోరుకుంటున్నా. రఘురామకృష్ణంరాజు గారు అంటే నాకు చాలా అభిమానం. మా హృదయకాలేయం సినిమా ఆయనకు నచ్చింది. ఒకసారి ఆయనతో కలిసి కోడిపందేలు చూసే అవకాశం కలిగింది. “చెన్నై లవ్ స్టోరీ” సినిమాను పదిసార్లు చూశాను. తప్పకుండా మీ మనసులు గెలుచుకునే చిత్రమిది. బేబి సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉందో ఈ చిత్రంలోనూ అంతకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం. మీరు మా చిత్రానికి బ్లాక్ బస్టర్ ఇస్తారా, సూపర్ హిట్ ఇస్తారా అనేది మా చేతుల్లో లేదు గానీ, మంచి సినిమా చేయడం మాత్రం మా చేతుల్లోనే ఉంది. మేమంతా చాలా కష్టపడి పనిచేశాం. ఒక గొప్ప సినిమా మీకు ఇవ్వబోతున్నామని నమ్ముతున్నాం. అన్నారు
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – నా సొంతూరు విజయవాడలో మా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ఈవెంట్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. విజయవాడ రాగానే ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదులుతున్నాయి. ఇక్కడే పవర్ స్టార్, మెగాస్టార్ నటించిన ఎన్నో సినిమాలు చూసి ఎంజాయ్ చేశాం. ఇక్కడ ఫుడ్ ను ఆస్వాదించాం. ఎన్నో మెమొరీస్ విజయవాడతో ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఎన్నో అందమైన లొకేషన్స్  ఉన్నాయి. మనం షూటింగ్స్ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లనక్కర్లేదు. మేము “చెన్నై లవ్ స్టోరీ” షూటింగ్ ఎక్కువగా ఏపీలోనే చేశాం. బీచ్ లో పెద్ద పెద్ద లైట్ హౌస్ సెట్స్ వేశాం. ఆ పర్మిషన్స్ అన్నీ ఒక్క ఫోన్ కాల్ తో మాకు వచ్చాయంటే ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధి పట్ల
ఎంత చిత్తశుద్ధితో ఉందో అర్థం చేసుకోవచ్చు. జూలై 24 నాకు ఎంతో ఇష్టమైన డేట్. ఆ రోజునే ఇంద్ర, తొలిప్రేమ జూలై 24నే రిలీజ్ అయ్యాయి. మెగాభిమానిగా నాకు అదొక కల్ట్ డేట్. ఈ నెల 23 నుంచే ప్రీమియర్స్ పడుతాయి. క, కె ర్యాంప్ సక్సెస్ తర్వాత మా సినిమా ఒప్పుకున్నారు కిరణ్ గారు. ఆయన 60 నిమిషాలు కథ విని సినిమా చేస్తున్నానంటూ ముందుకొచ్చారు. మా సినిమాను భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు. మీలో ఒకరిగా ఎదిగి పైకి వచ్చిన వ్యక్తి కిరణ్. ఆయన మంచి హీరోనే కాదు దర్శకుడు, నిర్మాత కూడా. కిరణ్ గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. తెలుగు అమ్మాయిలకే మేము అవకాశాలు ఇస్తున్నాం. ఈ చిత్రంతో శ్రీ గౌరి ప్రియ మరింత గుర్తింపు తెచ్చుకుంటారు. మణిశర్మ గారి సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యంతో వస్తున్న మా మూవీ పాటలన్నీ యూత్ ఎంజాయ్ చేస్తారు. నాకు ఎప్పుడూ తోడుండే స్నేహితుడు ధీరజ్, రెండుసార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్న నా మిత్రుడు సాయి రాజేష్ తో కలిసి వర్క్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో తొలి ప్రేమ, మలిప్రేమ..ఇలా మంచి కాన్సెప్ట్ లు ఉన్నాయి. ప్రేమ రెండక్షరాలు, జీవితం నాలుగు అక్షరాలు. కెరీర్ లో మనం గెలిస్తే ఏ ప్రేమైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మన బెజవాడ యూత్ అందరికీ నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్నారు.
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ – “చెన్నై లవ్ స్టోరీ” సినిమా పాటలు మెలొడియస్ గా ఉన్నాయి. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ తో వస్తున్న ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఈ చిత్రంలోని పాటలు చూస్తుంటే కిరణ్ గారు మన పొరిగింటి కుర్రాడిలా సహజంగా కనిపించారు. అలాంటి నేచురల్ పర్ ఫార్మెన్స్ ఆయన కనబర్చారు. అంత సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేస్తున్న కిరణ్ గారికి ఇది 12వ సినిమా. ఆయన 1200 చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నా. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ నేచురల్ ఎక్స్ ప్రెషన్స్ తో నటించి ఆకట్టుకుంది. ఎస్ కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ ఈ ముగ్గురు యువకులు కష్టపడి పైకి వచ్చారు. వారు తీసే సినిమాల్లో మంచి అభిరుచి కనిపిస్తుంటుంది. కలర్ ఫొటో సినిమా ఇందుకు మంచి ఉదాహారణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు “చెన్నై లవ్ స్టోరీ” సినిమా కూడా అలాంటి మంచి అభిరుచితోనే రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మనందరికీ కూడా నచ్చేలా ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాలు తీయడం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరుగుతుంది. ఈ మూవీ పేరులో చెన్నై పెట్టుకున్నా మన సముద్ర తీరాన్నే ఈ చిత్రంలో చూపించడం సంతోషంగా ఉంది. చీరాల, బాపట్ల, సూర్యలంక..ఇవన్నీ అద్భుతమైన లొకేషన్స్ ఉన్న ప్రాంతాలు. ఇలాంటి అందమైన లొకేషన్స్ మీ సినిమాలో చూపించినందుకు ఈ మూవీ టీమ్ ను అభినందిస్తున్నా. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మీకు కావాల్సిన అనుమతులన్నీ ఇస్తాం. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మీరు మీ స్టూడియోలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. అన్నారు.
డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ – కిరణ్ నాకు బాగా పరిచయమున్న హీరో. సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో సహజంగా నటిస్తూ ఆకట్టుకుంటాడు. పది సినిమాలు హిట్స్ వచ్చినా ఒదిగి ఉండే వ్యక్తిత్వమున్నవాడు. ఈ సినిమా కూడా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. శ్రీ గౌరి ప్రియ తెలుగమ్మాయి. నటించడమే కాదు బాగా పాటలు పాడుతుంది. మీ నెక్ట్స్ మూవీలో గౌరి ప్రియతోనే పాటలు పాడించండి. మన సినిమాల్లో చూపించే హీరోయిజానికి పేరడీగా హృదయకాలేయం సినిమా తీసి మనందరినీ ఎంటర్ టైన్ చేశాడు సాయి రాజేష్. ఈ దర్శకుడు మంచి సినిమాలు చేయగలడు అని అప్పుడే అనిపించింది. అద్భుతమైన సినిమాలు సాయి రాజేష్ రూపొందిస్తున్నాడు. కథ మీద మంచి అవగాహనతో ఈ చిత్ర నిర్మాతలు సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్లు తక్కువ టైమ్ లోనే మంచి విజయాలు సాధిస్తున్నారు. ఈ చిత్రంలోని నాలుగు పాటలు చూశాక ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందని అనిపిస్తోంది. మౌళిక సదుపాయాలను కల్పిస్తే ఏపీలో చిత్ర పరిశ్రమ త్వరగా అభివృద్ధి చెందుతుంది. మూవీస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. చిత్ర పరిశ్రమ మీద అవగాహన ఉన్న డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు ప్రభుత్వం తరుపున కావాల్సిన సహకారం చిత్ర పరిశ్రమకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ఈ థియేటర్ నాకు బాగా కలిసొస్తుంది. ఎస్ ఆర్ కల్యాణమండపం, వినరో భాగ్యము విష్ణుకథ. క సినిమాల ఈవెంట్స్  ఇక్కడే చేశాం. ఆ సినిమాల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా “చెన్నై లవ్ స్టోరీ”తో మనకు కలిసొస్తుంది. మీతో కలిసి ఈ రోజు “చెన్నై లవ్ స్టోరీ” సాంగ్స్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు మీతో కలిసి సినిమా చూద్దామా అనిపిస్తోంది. ఆ రోజు ఎంతమంది ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటారు, ఎంతమంది మొహాల్లో నవ్వులు పూస్తాయి అని చూడాలని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రామిస్ చేసి చెబుతున్నా వెండితెరపై మునుపెన్నడూ చూడని ప్రేమ కథను “చెన్నై లవ్ స్టోరీ”లో చూడబోతున్నారు. సినిమా చూస్తున్న 3 గంటలు మీరు ఒక లైఫ్ కు కనెక్ట్ అవుతారు. స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఈ సినిమా మీకు చాలా కాలం గుర్తుండిపోతుంది. ఇందులోని ఎమోషన్స్ అన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. బేబి సినిమా కంటే ఎక్కువసార్లు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి. బేబి సినిమా కంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. ఎస్ కేఎన్ బేబి తో కల్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. చెన్నై లవ్ స్టోరీతో క్లాసిక్ బ్లాక్ బస్టర్ అవుతుంది. మీరు మా మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలి. ఇందాక గౌరి చెప్పినట్లు స్టీవెన్, నిధి ప్రేమ కథ చాలా రోజులు గుర్తుండిపోతుంది. రాజా వారు..సినిమాలో సాఫ్ట్ క్యారెక్టర్ చేశా. ఇప్పుడు మళ్లీ చెన్నై లవ్ స్టోరీలో సాఫ్ట్ క్యారెక్టర్ లో మీ ముందుకు రాబోతున్నా. మీకు స్టీవెన్ బాగా నచ్చుతాడు. రీసెంట్ గా మాస్ చేశా. ఇప్పుడు క్లాస్ లవ్ స్టోరీతో వస్తున్నాం. అన్నారు.
“చెన్నై లవ్ స్టోరీ” సినిమాలో శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ నటిస్తోంది. “కలర్ ఫొటో”, “బేబి” వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేష్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందించగా రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 24న “చెన్నై లవ్ స్టోరీ” మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
నటీనటులు – కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ, తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – దేవి పర్చూరి
ఆర్ట్ – భాస్కర్ ముదావత్
ఎడిటర్ – సంతోష్ నాయుడు
డీవోపీ – విశ్వాస్ డేనియల్
లిరిక్స్ – అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – విశాల దాట్ల
లైన్ ప్రొడ్యూసర్ -శ్యామ్ ప్రసాద్ మేక
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా), వంశీ కాకా
మార్కెటింగ్ – హౌస్ ఫుల్
కో ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ – సాయి రాజేష్
నిర్మాతలు – ఎస్ కేఎన్, సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – రవి నంబూరి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.