Skip to content

మెదక్ జిల్లాలో పర్యటించిన నటుడు విష్ణు మంచు

మెదక్, తెలంగాణ: ప్రముఖ నటుడు విష్ణు మంచు, మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ గారి ఆహ్వానం మేరకు మెదక్ జిల్లాలో ఒకరోజు పర్యటించారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన, జిల్లాలోని పలు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మంచు చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ కోట, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గాభవాని ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ కేథడ్రల్‌లను సందర్శించారు. అక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు మంచు, మెదక్ జిల్లాకు అపారమైన పర్యాటక, సినీ చిత్రీకరణ అవకాశాలు ఉన్నాయని అన్నారు…

Read more

‘హే చికీతా’ తో అందరికీ మంచి పేరు రావాలి – చదలవాడ శ్రీనివాసరావు

అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్,…

Read more

సెప్టెంబర్ 10న ‘మండాడి’ రిలీజ్

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ మూవీని ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుహాస్, సూరి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది…

Read more

‘అమీర్ లోగ్’ నుంచి ‘సీదా హెలికాప్టర్ షాట్’ పాట విడుదల

'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణ రెడ్డి సోమ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను దక్కించుకోవడం ఈ ప్రాజెక్ట్‌‌పై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు విశేష ఆదరణ లభించింది. ఈ క్రమంలో చిత్ర బృందం "సీదా హెలికాప్టర్ షాట్" అనే పాటను విడుదల…

Read more

‘ఫీల్ మై లవ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌ చిత్రం ‘ఫీల్ మై లవ్’ . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి,మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.. ఇక తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతి ‘ఫీల్ మై లవ్’ ఫస్ట్…

Read more

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ సాంగ్ రిలీజ్

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను, పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘ఎలగే పిల్ల’ అనే పాటను రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కు అభినందనలు…

Read more

పట్టభద్రులైన విద్యార్థుల్ని అభినందించిన విశాల్

యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విశాల్ సేవాభావం, ఆయన చేసే సమాజ సేవ గురించి అందరికీ తెలిసిందే. పేద విద్యార్థులు, అనాథల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఆయన సేవా సంస్థలు, ట్రస్ట్‌‌ల ద్వారా ఎంతో మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంటారు. ఈ క్రమంలో విశాల్ ఆధ్వర్యంలోని దేవి సోషల్, ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మద్దతుతో 10 మంది విద్యార్థులు రీసెంట్‌గా పట్టభద్రులయ్యారు. సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో ఈ విద్యార్థులంతా పట్టభద్రులయ్యారు. అంతే కాకుండా దీపిక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు ఈ మేరకు విశాల్ తన సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ఈ యంగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ తమ…

Read more

‘చోర శికామణులు’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం..

శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్న చిత్రం ‘చోర శికామణులు’. ఆనంద్ కుర్మా ఈ మూవీకి కథ, కథనం, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్‌లో రానున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. ‘చోర శికామణులు’ చిత్ర ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ…

Read more

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. ఇక రేపు (జూలై 10) మూవీ విడుదలవుతున్న తరుణంలో మరింత హైప్ పెంచేందుకు రిలీజ్ ట్రైలర్‌ను తీసుకు వచ్చారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు’, ‘కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. అన్ని తప్పులు క్షమిస్తే.. మనం తప్పు చేసినట్టే’, ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే…

Read more

‘అమీర్ లోగ్’ లాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది: వంశీ నందిపాటి

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అమీర్‌ లోగ్’. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్ , రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో నిర్మాత వంశీ నందిపాటి మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో.. వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ మూవీని నేను ఆల్రెడీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్…

Read more