‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: కథానాయకుడు సూర్య తమిళ…
ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’
కదిర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షా, సుధి కొప్పా, శ్రీకాంత్ మురళి, జియో బేబీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫారెస్ట్ గార్డ్’. ఈ మూవీకి ఎంసీ జోసెఫ్ దర్శకత్వం వహించగా.. రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఈ సినిమాకి సూరజ్ ఎస్ కురుప్ సంగీత మందించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం ఆహాలోకి వచ్చింది. ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చిన వెంటనే ఇది టాప్‌లో ట్రెండ్ అవుతూ ఉంది.
సినిమా మొత్తం అటవీ ప్రాంతంలో జరగడం, అక్కడ సీక్రెట్‌గా జరిగిన ఒక కలయిక ప్రమాదకర మలుపు తిరగడం, ఆ తర్వాత కథనంలో వచ్చే ట్విస్ట్‌లు అదిరిపోతాయి. ఒక రాత్రిలో జరిగే ఈ కథ క్షణక్షణం ఉత్కంఠరేకెత్తించేలా ఉంటుంది. నమ్మకద్రోహం కారణంగా మిథున్ గడిపే ఆ రాత్రి ప్రాణాలను కాపాడుకునే పోరాటంగా మారుతుంది. అయితే అతను ఎవరిని నమ్మగలడు? ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అన్నదే సినిమా.
ఇందులో కదిర్ నటనతో పాటుగా షైన్ టామ్ చాకో పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి.
నటీనటులు: కదిర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షా, సుధి కొప్పా, శ్రీకాంత్ మురళి, జియో బేబీ తదితరులు
దర్శకుడు: ఎంసీ జోసెఫ్
నిర్మాత: రాజశేఖర్ అన్నభిమోజు
సంగీతం: సూరజ్ ఎస్ కురుప్

