Skip to content

‘సోనీ విళా’ను ఆవిష్క‌రించిన సోనీ పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్స్ ఇండియా

  • తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ప్రదర్శిస్తూ ‘సోనీ విళా’ ఆవిష్క‌ర‌ణ‌. ప్రీమియం స్థాయిలో రూపొందిన భావోద్వేగభరితమైన తమిళ కథలను వివిధ స్క్రీన్స్‌, కుటుంబాలు, భౌగోళిక ప్రాంతాలకు చేరువ చేసేలా రూపొందిన కొత్త బ్రాండ్.

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) తాజాగా తన కొత్త తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కు ‘సోనీ విళా’ అనే పేరు, బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. అక్టోబర్ 2026లో ఈ ఛానల్ లాంచ్ కానుంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్న SPNI.. తమిళ సంస్కృతి, భావోద్వేగాలు, భాష, స్థానిక జీవన విధానాలకు బలమైన అనుబంధంతో కూడిన ప్రీమియం కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో.. అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలు, క్రియేటివ్ ఎగ్జిక్యూషన్‌, భారీ స్థాయితో రూపొందించే ఈ కంటెంట్ తమిళనాడు స‌హా ప్ర‌పంచం అంతటా ఉన్న ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుంది. టెలివిజన్, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఒరిజినల్ ఫిక్షన్, గ్లోబల్ రియాలిటీ ఫార్మేట్స్, సినిమాలు, భారీ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను ‘సోనీ విళా’ అందించనుంది. తమిళ కుటుంబాలకు తమదైన అనుభూతిని కలిగించేలా, అదే సమయంలో విస్తృతమైన ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఈ ఛానల్ కంటెంట్ రూపొంద‌నుంది.

ఆగ‌స్ట్ 15..ఇండిపెండెన్స్ డే సందర్భంగా చిన్నారులు ఆలపించిన ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శిస్తూ ‘సోనీ విళా’ పేరు, లోగోను ఆవిష్కరించారు. తమిళనాడులో ‘తమిళ్ తాయ్ వాళ్తు’కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ముఖ్యమైన కార్యక్రమాల ప్రారంభంలో ఈ గీతాన్ని ఆలపించడం ఆనవాయితీగా వస్తోంది. తమిళులు గ‌ర్వంగా అన్ని దిశల్లో పరిమళంలా వ్యాపించాలనే ఈ గీతం భావన ‘సోనీ విళా’ బ్రాండ్ ఆలోచనకు స్ఫూర్తిగా నిలిచింది. తమిళనాడు నేల నుంచి పుట్టే కథలు, అక్కడి ప్రజల ఆప్యాయత, జ్ఞాపకాలు, ఆశలు, సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ.. అత్యున్నత నిర్మాణ విలువలు, లోతైన భావోద్వేగాలతో రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ‘సోనీ విళా’ను రూపొందించారు.

‘విళా’ అంటే తమిళంలో వేడుక లేదా పండుగ అని అర్థం. ఈ పేరు ఛానల్‌ స్పిరిట్‌ను ప్రతిబింబిస్తుంది. తమిళ కథలు, ప్రతిభ, సంగీతం, కుటుంబం, ఆశయాలు, పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సెలబ్రేట్ చేస్తూ.. ప్రేక్షకులతో భావోద్వేగపరంగా కనెక్ట్ అయ్యేలా ‘సోనీ విళా’ను రూపొందించారు. ‘సోనీ విళా’ లోగోలో ఎల్లో, ఎలక్ట్రిక్ బ్లూ రంగులను ఉపయోగించారు. తమిళనాడులో వేడుకలకు అనుబంధంగా ఉండే పసుపు, బంతిపూల వంటి రంగుల నుంచి ఎల్లో రంగును తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బ్లూ బ్రాండ్ ఐడెంటిటీకి సరికొత్త, కాంటెంపరరీ, ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చింది. తమిళ సంస్కృతితో బలమైన అనుబంధాన్ని కలిగి ఉండటంతో పాటు.. భావోద్వేగాలకు దగ్గరగా, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘సోనీ విళా’ బ్రాండ్‌ను తీర్చిదిద్దినట్లు ఇది తెలియజేస్తుంది. ఈ సంద‌ర్భంగా..

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా సౌత్ రీజినల్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాజారామన్ సుందరం మాట్లాడుతూ.. “సోనీ విళా ద్వారా తమిళ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి ఎంతో ఆప్యాయతతో అడుగుపెడుతున్నాం. తమిళ మార్కెట్‌కు ఎంతో గొప్ప క్రియేటివ్ లెగసీ ఉంది. భావోద్వేగాలు, నిజాయతీ, సాంస్కృతిక గర్వంతో కూడిన కథలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే ఎంతో వినయంతో, గౌరవంతో, ఈ రంగానికి ఏదో ఒక అర్థవంతమైన కొత్తదనాన్ని జోడించాలనే నిజాయతీతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం.

ప్రేక్షకులకు తమ ఇంటి కథల్లా అనిపించే ప్రీమియం కథలను అందించడంతో పాటు, కొత్త తరం తమిళ ప్రేక్షకుల ఆలోచనలు, ఆసక్తులు, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా వాటిని రూపొందించట‌మే మా ల‌క్ష్యం. ఈ తరం ప్రేక్షకులు మరింత షార్ప్‌గా, ఫాస్ట్‌గా, ఫన్నీగా ఉంటూ.. ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాకుండా ప్రపంచాన్ని చూడాలనే ఆసక్తితో ఉన్నారు. అదే సమయంలో.. ఈ కథలను మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన స్కేల్, క్రాఫ్ట్, లక్ష్యంతో వాటిని ఆవిష్కరించాలనుకుంటున్నాం.

‘తమిళ్ తాయ్ వాళ్తు’లో తమిళ భాష, సంస్కృతిపై ఉన్న గర్వం అన్ని దిశల్లో పరిమళంలా వ్యాపించాలనే భావన ఎంతో అందంగా వ్యక్తమవుతుంది. అదే ఆలోచన ‘సోనీ విళా’కు స్ఫూర్తిగా నిలిచింది. భావోద్వేగాలకు బలమైన పునాదిగా, తమిళ సంస్కృతితో గాఢమైన అనుబంధంతో.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునేలా ‘సోనీ విళా’ను రూపొందిస్తున్నాం. ఈ రోజు కృతజ్ఞతతో మా ఛానల్ పేరు, లోగోను ఆవిష్కరిస్తున్నాం. అక్టోబర్‌లో ఈ ఛానల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అన్నారు.

సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI)లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’, ‘ఇండియన్ ఐడల్’, ‘CID’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రాంచైజీలు ఉన్నాయి. ప్రజల్లో చెరగని ముద్ర వేసే పాపులర్ బ్రాండ్స్‌ను నిర్మించిన ఆ అనుభవాన్ని ‘సోనీ విళా’ కూడా కొనసాగించనుంది. అదే సమయంలో.. తమిళ నేటివిటీ, సంస్కృతికి దగ్గరగా ఉండే ప్రత్యేకమైన స్వరంతో తనదైన గుర్తింపును ఏర్పరుచుకోనుంది. స్థానిక ఆత్మను ప్రతిబింబిస్తూ, భావోద్వేగాలకు కనెక్ట్ అయ్యే కథనాలతో, ప్రీమియం స్థాయి నిర్మాణ విలువలతో.. విస్తృతమైన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ‘సోనీ విళా’ను రూపొందిస్తున్నారు.

‘సోనీ విళా’ ప్రోగ్రామింగ్ లైనప్‌తో పాటు.. ఛానల్ లాంచ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నసోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా.

Channel announcement Link: https://www.instagram.com/reel/DcC5fThpIqn

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.