‘సోనీ విళా’ను ఆవిష్కరించిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా
తమిళ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ప్రదర్శిస్తూ ‘సోనీ విళా’ ఆవిష్కరణ. ప్రీమియం స్థాయిలో రూపొందిన భావోద్వేగభరితమైన తమిళ కథలను వివిధ స్క్రీన్స్, కుటుంబాలు, భౌగోళిక ప్రాంతాలకు చేరువ చేసేలా రూపొందిన కొత్త బ్రాండ్. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) తాజాగా తన కొత్త తమిళ జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కు ‘సోనీ విళా’ అనే పేరు, బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. అక్టోబర్ 2026లో ఈ ఛానల్ లాంచ్ కానుంది. తమిళ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్న SPNI.. తమిళ సంస్కృతి, భావోద్వేగాలు, భాష, స్థానిక జీవన విధానాలకు బలమైన అనుబంధంతో కూడిన ప్రీమియం కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో.. అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలు, క్రియేటివ్ ఎగ్జిక్యూషన్,…
