Skip to content

రెండు పార్టులుగా రాబోతోన్న ‘కరికాల’ 2027 జూలై 2న మొదటి చాప్టర్‌, 2027 అక్టోబర్ 28న రెండో చాప్టర్

  • రెండు పార్టులుగా రాబోతోన్న ‘కరికాల’.. 2027 జూలై 2న మొదటి చాప్టర్‌, 2027 అక్టోబర్ 28న రెండో చాప్టర్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు యుగంధర్ ముని సందీప్ కిషన్‌తో ప్రకటించిన ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రకటన నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

‘కరికాల’ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఈ పోస్టర్‌లో సందీప్ కిషన్ కనిపిస్తున్న తీరు చాలా కొత్తగా ఉంది. గుర్రంపై హీరో, చేతిలో ఖడ్గం, సింహాన్నే పరిగెత్తిస్తున్నట్టుగా ఆ రాజసం అన్నీ కూడా సినిమాపై ఉత్సుకతను పెంచేలా ఉన్నాయి. ఈ టైటిల్ పోస్టర్‌తో ఒక్కసారి అంచనాల్ని రెట్టింపు చేసేశారు. ఈ మూవీని రెండు పార్టులుగా మేకర్లు ప్లాన్ చేశారు. మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న రానుంది. రెండు పార్టుల రిలీజ్ డేట్‌లను ఒకే సారి ప్రకటించడం చూస్తుంటే.. ఇది ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న స్థాయిని, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

‘శంభాల’ విజయం తర్వాత, దర్శకుడు యుగంధర్ ముని, షైనింగ్ పిక్చర్స్ బృందం ఈ ‘కరికాల’ ప్రాజెక్ట్‌ను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. విస్తృతమైన ప్రపంచ నిర్మాణం, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో, ‘కరికాల’ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

‘కరికాల’ వంటి అద్భుతమైన టైటిల్ ఆవిష్కరణ, ఆకట్టుకునే ఫస్ట్ లుక్, మ్యాజికల్ ఫాంటసీ సెట్టింగ్, రెండు భాగాలుగా విడుదల చేసే వ్యూహంతో ఒక్కసారిగా రాబోతోన్న పాన్-ఇండియా చిత్రాల్లో ఇదొక క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది, సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తర్వాత వెల్లడించనున్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.