మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో…
“మిషన్ పాజిబుల్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- త్వరలో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ
నటుడు, దర్శకుడు నవీన్ హిదయత్ రూపొందించిన తమిళ సూపర్ హిట్ డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ “మూదర్ కూడమ్”. 2013లో రిలీజైన ఈ సినిమాకు సీక్వెల్ గా మూదర్ కూడమ్ 2 రూపొందుతోంది. ఈ సినిమా “మిషన్ పాజిబుల్” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవీన్ హిదయత్, ఒవియా, సెన్రయాన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ హిదయత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్రాండెల్ పిక్చర్స్ బ్యానర్ పై సంకిత్ బోరా, కమల్ బోరా నిర్మిస్తున్నారు.
ఈ రోజు మేకర్స్ “మిషన్ పాజిబుల్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ నగరంలో డైనోసార్స్ భీభత్సం సృష్టిస్తుండటం, వాటిని తరిమేందుకు ఆర్మీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగడం, శాంటాక్లాజ్ డ్రెస్ లో ఉన్న ఒక బొమ్మను ఫాలో అవుతూ మూవీలోని ప్రధాన పాత్రధారులు పరుగెత్తడాన్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఓ భారీ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తలపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే “మిషన్ పాజిబుల్” మూవీ సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.
ఈ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్నాయి. “మిషన్ పాజిబుల్” సినిమాను ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, క్రోయేషియా, స్లొవేనియా, కజికిస్థాన్ దేశాల్లోని రేర్, బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించడం విశేషం.
ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నవీన్ హిదయత్ మాట్లాడుతూ- నా మనసుకు దగ్గరైన కథ ఇది. ప్రేక్షకులు చాలా ఏళ్లుగా మీ సినిమా సీక్వెల్ ఎప్పుడు అని అడుగుతూ వస్తున్నారు. సీక్వెల్ చేయాలి కాబట్టి పార్ట్ 2 చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు. మొదటి భాగం కథతో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేస్తూనే వారిని ఆశ్చర్యపరిచే కథతో మిషన్ పాజిబుల్ సినిమా రూపొందించాను. అడ్వెంచర్ తో సాగుతూ ఎంటర్ టైన్ చేసే స్టోరీ ఇది. ఈ సినిమాను నేను అనుకున్న గ్రాండ్ స్కేల్ లో రూపొందించేందుకు కావాల్సినంత స్వేచ్ఛను ఇచ్చి ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్స్ సంకిత్ బోరా, కమల్ బోరాకు థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్స్ సంకిత్ బోరా, కమల్ బోరా మాట్లాడుతూ – ప్రేక్షకుల ప్రేమాభిమానాల నుంచే కల్ట్ క్లాసిక్స్ వస్తాయి. నవీన్ ఈ కథ చెప్పినప్పుడే ఇది కేవలం సీక్వెల్ కాదు ఒక పెద్ద కాన్వాస్ మీద ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ అందించే సినిమా అనిపించింది. ప్రతి టెక్నీషియన్ ఈ మూవీని అందంగా తెరపైకి తీసుకొచ్చేందుకు కష్టపడ్డారు. మిషన్ పాజిబుల్ సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురిచేస్తూ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.
నటీనటులు – నవీన్ హిదయత్, ఒవియా, సెన్రయాన్, రాజాజీ, కుబేరన్, జయప్రకాష్, తదితరులు
టెక్నీషియన్స్
——————–
వీఎఫ్ఎక్స్, యానిమేషన్ సూపర్ వైజర్ – కె.ఎ. బట్చా
ఎడిటర్ – అతియప్పన్ శివ
డీవోపీ – సూరజ్ నల్లుసామి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – నటరాజన్ శంకరన్
మ్యూజిక్ (సాంగ్స్ ) – అమ్రిషన్, నటరాజన్ శంకరన్
ప్రొడ్యూసర్స్ – సంకిత్ బోరా, కమల్ బోరా
స్క్రిప్ట్, డైరెక్షన్ – నవీన్ హిదయత్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
Stills Link – https://we.tl/t-dvZ8mmTxYbVxOxeA

