Skip to content

విశాల్ ‘మకుటం’ నుంచి ‘కలతేలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’, ఫోక్ సాంగ్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మరో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

‘కలతేలా’ అంటూ సాగే సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇదొక ఫ్యామిలీ, మోటివేషనల్ సాంగ్‌లా కనిపిస్తోంది. ఇందులో విశాల్, దుషారలతో పాటుగా పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఈ పాటను రాజశ్రీ సుధాకర్ రచించగా.. కృష్ణ తేజస్వీ ఆలపించారు. ఇక జీవీ ప్రకాష్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఈ పాట యూట్యూబ్‌లో ఇట్టే ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది.

ఈ సినిమాకి రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం కెమెరామెన్లుగా, N.B. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

నటీనటులు : విశాల్, అంజలి, దుషార విజయన్, జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ, పదం కుమార్, సభుమోన్ తదితరులు

టెక్నికల్ టీం:

నిర్మాణం: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాతలు: బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా
సమర్పణ : R.B. చౌదరి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: విశాల్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: జి. దురైరాజ్
యాక్షన్ డైరెక్టర్: దిలీప్ సుబ్బరాయన్
ఎడిటర్: N.B. శ్రీకాంత్
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.