Skip to content

ఆగస్టు 14న రిలీజ్ కాబోతోన్న విశాల్ ‘మకుటం’

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే విశాల్ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా…

Read more

విశాల్ ‘మకుటం’ నుంచి ‘కలతేలా’ అంటూ సాగే సాంగ్ రిలీజ్

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’, ఫోక్ సాంగ్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా మరో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘కలతేలా’ అంటూ సాగే సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇదొక ఫ్యామిలీ, మోటివేషనల్ సాంగ్‌లా కనిపిస్తోంది. ఇందులో విశాల్, దుషారలతో పాటుగా పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఈ పాటను రాజశ్రీ సుధాకర్ రచించగా.. కృష్ణ తేజస్వీ…

Read more

పట్టభద్రులైన విద్యార్థుల్ని అభినందించిన విశాల్

యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విశాల్ సేవాభావం, ఆయన చేసే సమాజ సేవ గురించి అందరికీ తెలిసిందే. పేద విద్యార్థులు, అనాథల గురించి ఆయన ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. ఆయన సేవా సంస్థలు, ట్రస్ట్‌‌ల ద్వారా ఎంతో మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంటారు. ఈ క్రమంలో విశాల్ ఆధ్వర్యంలోని దేవి సోషల్, ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ మద్దతుతో 10 మంది విద్యార్థులు రీసెంట్‌గా పట్టభద్రులయ్యారు. సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 35వ స్నాతకోత్సవంలో ఈ విద్యార్థులంతా పట్టభద్రులయ్యారు. అంతే కాకుండా దీపిక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు ఈ మేరకు విశాల్ తన సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘ఈ యంగ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ తమ…

Read more

‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.. ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశాల్

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు సెకండ్ సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో.. విశాల్ మాట్లాడుతూ .. ‘‘మకుటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. ‘శివ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ…

Read more
‘మకుటం’ నుంచి విశాల్ పాడిన ‘రైజ్ ఆఫ్ లింగా’ పాట విడుదల Telugu News

‘మకుటం’ నుంచి విశాల్ పాడిన ‘రైజ్ ఆఫ్ లింగా’ పాట విడుదల

వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి రవి అరుసు కథను అందించారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. విశాల్‌ సరసన ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ‘మకుటం’ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారు. తాజాగా విశాల్ ఈ సినిమాలో లింగా అనే…

Read more
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన విశాల్ Telugu News

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన విశాల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ క్షణం నుంచి కోలీవుడ్ ప్రముఖులంతా ఒక్కొక్కరిగా వెళ్లి ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తూనే ఉన్నారు. తాజాగా విశాల్ తన స్నేహితుడు అయిన సీఎం విజయ్‌ని కలిశారు. ఈ మేరకు ఆయన ఈ భేటీ గురించి పోస్ట్ చేశారు. ‘లయోలా కాలేజీలో మన పరిచయం ఏర్పడిన నాటి నుంచి నేను మిమ్మల్ని ‘డార్లింగ్’ అని పిలుస్తూనే ఉన్నాను.. అందులో ఎలాంటి మార్పు రాలేదు. ఓ సాధారణ హీరోగా మొదలైన మీ ప్రయాణంలోని అన్ని అడ్డంకులను, విమర్శలను ఎదుర్కొని, మీ మౌనంతో, విజయంతో వాటన్నిటినీ పక్కకు నెట్టేశారు. ఒక సూపర్‌స్టార్‌గా మీరు ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈనాడు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి…

Read more
విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో Telugu News

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ఆర్.బి. చౌదరి నిర్మానంలో విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మకుటం’. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్, పోస్టర్లు చూస్తే ఇదొక డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థం అవుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. విశాల్, అంజలి కాంబోకి ఉన్న హిట్స్, క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఈ ‘మకుటం’ చిత్రంలోనూ విశాల్ సరసన అంజలి నటించనున్నారు. ఈ మేరకు అంజలి, విశాల్ కలిసి ఓ కాన్సెప్ట్ వీడియోని చేశారు. హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని…

Read more
విశాల్ మొగుడు గ్లింప్స్ రిలీజ్.. సినిమాపై హైప్ పెంచేసిన వీడియో Telugu News

విశాల్ మొగుడు గ్లింప్స్ రిలీజ్.. సినిమాపై హైప్ పెంచేసిన వీడియో

తమిళ దర్శకుల్లో ‘సుందర్ C’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నారు సుందర్ సి. అవ్ని సినీమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై కుష్బూ సుందర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు A.C.S అరుణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొగుడు అనే టైటిల్ తో రాబోతున్న చిత్రంలో విశాల్‌ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. కమెడియన్ యోగిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాఫ్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మరోవైపు ప్రమోషన్స్…

Read more
విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి Telugu News

విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి

వెర్సటైల్ హీరో విశాల్‌ స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ చిత్రం రాబోతోంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ సంచలనంగా మారాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరుసగా 17 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ నుంచి ఓ ప్రెస్ నోట్‌ని కూడా రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే.. ‘విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్‌తో కూడిన…

Read more
విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్ Telugu News

విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ‘మకుటం’.. దీపావళి సందర్భంగా స్పెషల్ అప్డేట్

వెర్సటైల్ హీరో విశాల్‌కి దర్శకత్వ శాఖలో మంచి పట్టు ఉంది. ఇప్పటికే దర్శకుడిగా ప్రాజెక్ట్‌లు రెడీగా ఉన్నాయి. అయితే ‘మకుటం’ మూవీతో విశాల్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. అయితే దర్శకుడిగా రవి అరసు ఆధ్వర్యంలో కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు విశాల్ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేశారు. విశాల్ ప్రస్తుతం ఈ మూవీకి హీరోగా, దర్శకుడిగా పని చేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ క్రేజీ న్యూస్‌ను ప్రకటించారు. ఈ మేరకు విశాల్ స్పందిస్తూ.. ‘దీపావళి ప్రత్యేక సందర్భంగా నా ప్రస్తుత చిత్రం మగుదం/మకుటం నుంచి…

Read more