‘మకుటం’ చిత్రం విజయం సాధించాలని అందరూ కోరుకుంటున్నారు.. ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశాల్
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘ది రైజ్ అఫ్ లింగా’ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఆదివారం (జూన్ 28) నాడు సెకండ్ సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ అనే పాటను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో.. విశాల్ మాట్లాడుతూ .. ‘‘మకుటం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నందుకు ఆనందంగా ఉంది. ఈ సారి దర్శకుడిగా మారి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాను. ‘శివ’ చూసిన తరువాత దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. ఇన్నాళ్లకు ఆ…
