ఘన విజయానికి హామీ ఇస్తున్న రవితేజ ‘మాస్ జాతర’ టీజర్
మాస్ అంశాలు, వినోదం మేళవింపుతో ఆకట్టుకుంటున్న 'మాస్ జాతర' టీజర్ ఆగస్టు 27న థియేటర్లలో మాస్ పండుగ మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న విడుదల కానున్న 'మాస్ జాతర' కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలు 'మాస్ జాతర' టీజర్ లో ఉన్నాయి. నిజానికి అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి…