పరశురామ జయంతి సందర్భంగా ‘మహావతార్ పరశురామ్’ టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్
భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన హోంబలే ఫిల్మ్స్, ‘రాజకుమార’, ‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘సలార్’, ఇటీవల వచ్చిన ‘మహావతార్ నరసింహ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో సినిమా స్థాయి, స్టోరీ టెల్లింగ్ ని రీడిఫైన్ చేసింది. అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు మరో శక్తివంతమైన అధ్యాయంగా ‘మహావతార్ పరశురామ్’ను తీసుకువస్తోంది. భక్తి, యాక్షన్‌తో ఆకట్టుకున్న ‘మహావతార్’ విజయానంతరం, ఈ కొత్త భాగంతో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. పరశురామ జయంతి సందర్భంగా విడుదలైన అనౌన్స్మెంట్, ‘మహావతార్’ సినీమాటిక్ యూనివర్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో, క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం, పరశురాముడి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా ఆవిష్కరించనుంది. పురాణ గాథలతో పాటు ఆధునిక విజువల్…
