‘రాకాస’ ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
‘కమిటీ కుర్రోళ్లు’ వైవిధ్యమైన కంటెంట్ బేస్డ్ మూవీని నిర్మించి తొలి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు నిహారిక కొణిదెల. ఇప్పుడు నిహారిక జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో నిర్మిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’. మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో నటుడిగా మెప్పించిన సంగీత్ శోభన్ తొలిసారి సోలో హీరోగా ఇందులో నటిస్తున్నారు. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా గ్లింప్స్, టైటిల్ మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సంగీత్ శోభన్ సోలో హీరోగా తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూ…
