గోపీచంద్ సినిమాకు ‘భరతవర్ష’ ఫిక్స్
హీరో టి. గోపీచంద్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ డ్రామా #గోపీచంద్33తో తన కెరీర్లో ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో, పవన్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గోపీచంద్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్ను ఆవిష్కరించారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్, శూల భూమిలో ప్రారంభమై, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధుల క్లోజప్లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు కనువిందు చేసే విజువల్ ఫీస్ట్ ని అందించాయి…
