‘సతీ లీలావతి’ వినోదాత్మక చిత్రం – లావణ్య త్రిపాఠి కొణిదెల
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టుగా బుధవారం నాడు ప్రకటించారు. ఈ క్రమంలో ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కు సంబంధించిన ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో.. లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. సప్తగిరి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో…
