‘కటాలన్’కి రవి బస్రూర్ మ్యూజిక్
కేజీఎఫ్, మార్కో వంటి సినిమాలతో దక్షిణ భారతంలో సంచలనంగా మారిన రవి బస్రూర్, మరోసారి తన సంగీతంతో మ్యూజికల్ సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యారు. క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “కటాలన్” కోసం ఆయనను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ముందుగా ఈ చిత్రానికి బి. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తారని వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు అధికారికంగా రవి బస్రూర్ ఈ బాధ్యతలు చేపట్టినట్లు ప్రకటించారు. పాన్-ఇండియా స్థాయిలో ప్లాన్ చేసిన ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళ సినీ చరిత్రలోనే అతిపెద్ద విడుదలల్లో ఒకటిగా ఇది నిలవనుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం…
