‘రుద్రవనం పీఎస్’ పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను – డైరెక్టర్ హరీష్ శంకర్
ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. ఈ సిరీస్‌ను జీ5లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో.. హరీష్ శంకర్ మాట్లాడుతూ .. ‘‘మా నిర్మాత రమేష్ పుప్పాల గారిని మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉంది. ‘మిరపకాయ్’ టైంలో రమేష్ గారు నన్నెంతో ఎంకరేజ్ చేశారు. రాజా రవీంద్ర సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వివేక్ కూచిభోట్ల గారు నా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు…
