Skip to content

‘సహ'(లైఫ్ ఆఫ్ సంజు) సెప్టెంబర్ 4న రిలీజ్

నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘సహా (లైఫ్ ఆఫ్ సంజు)’ ప్రస్తుతం ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ప్రేమ, అనుబంధాలు, జ్ఞాపకాలు, జీవితంలో ఎదురయ్యే భావోద్వేగ సంఘర్షణల చుట్టూ సాగనుంది. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తి పెంచుకున్న ‘సహా’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ జర్నీలో ఆత్మీయంగా కనిపించారు. ఈ విజువల్ ఇద్దరి మధ్య ప్రేమ, అనుబంధాన్ని సహజంగా…

Read more

‘సహ’ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను: కిరణ్ అబ్బవరం

నిశాంత్ దోటి, సుమైరా స్టూడియో ఎమోషనల్ డ్రామా 'సహ' (లైఫ్ ఆఫ్ సంజు) నుంచి 'కాలాన్నే తిరగేసి' సాంగ్ లాంచ్ ప్రేమ, జ్ఞాపకాలు, జీవిత పోరాటం వంటి భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కథగా తెరకెక్కుతున్న చిత్రం 'సాహ (లైఫ్ ఆఫ్ సంజు)'. నాస్టాల్జిక్ ఎమోషన్స్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించబోతోంది. నిశాంత్ దోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివ కుమార్ కాసారం హీరోగా నటిస్తుండగా, శ్వేత లక్ష్మణ్, వ్రజనా పాండ్యా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమైరా స్టూడియోస్ బ్యానర్‌పై తేజేశ్వర్ వెల్పుచర్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ది సోల్ ఆఫ్ సాహ' గ్లింప్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. తాజాగా చిత్ర బృందం మ్యూజికల్…

Read more