పెద్దిలో నేను చేసిన గౌర్నాయుడు పాత్ర చాలా ఆనందాన్ని ఇచ్చింది: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. బుచ్చిబాబు గారు ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అంశాలు ఏమిటి? -పెద్ది అద్భుతమైన కథ. నా పాత్ర…
