‘మొహబ్బత్’ చిత్రం ప్రారంభం
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అందిస్తూ మ్యాక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు చిన్న శ్రీశైలం యాదవ్ గారు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్ యాదవ్ గారు క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం నవీన్ యాదవ్ గారు చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా లాంచ్ చేశారు. చిత్రయూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ .…
