‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఫైనల్ ట్రైలర్ విడుదల
మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో సినిమా ఇది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్‌లో 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజే (జెండయా)తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్‌గా ఉండబోతుందనే విషయం మరోసారి స్పష్టమైంది. అలాగే ఈ ట్రైలర్‌లో మార్క్ రఫాలో హల్క్ పాత్రలో…
