‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ లాంచ్
ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. 'నో వే హోమ్' సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని…
