‘స్వయంభూ’ నుంచి ‘రా రా ధీవర’ రిలీజ్
నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్వయంభూ'తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో విడుదలైన ఫస్ట్ సింగిల్ 'రా రా ధీవర' అంచనాలను భారీగా పెంచింది. రవి బస్రూర్ సంగీతం అందించడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆయన ఆ అంచనాలను మించి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. పవర్ ఫుల్ డ్రమ్స్, ఆర్కెస్ట్రా లేయర్స్‌తో పాట ఒక యోధుడి నినాదంలా అనిపిస్తుంది. సంతోష్ వెంకీ వోకల్స్ పవర్‌ను మరింత పెంచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ధైర్యం, సంకల్పం, యోధుని ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఈ పాటలో నిఖిల్…
