Skip to content

‘ఒకే ఒక జీవితం’ డైరెక్టర్ శ్రీ కార్తిక్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్‌

దక్షిణాది సినీ పరిశ్రమలో సెన్సేషన్‌గా మారిన రుక్మిణి వసంత్, దర్శకుడు శ్రీ కార్తిక్‌తో చేతులు కలిపారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది. హై కాన్సెప్ట్ సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కథాంశానికి తల్లీకొడుకుల మధ్య హత్తుకునే భావోద్వేగాలను జోడించి తెరకెక్కించిన ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత శ్రీ కార్తిక్ తెరకెక్కించనున్న నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నారు. దేవ్ రామనాథ్, వినాయక్ వైద్యనాథన్…

Read more