‘కొక్కోరొకో’ షూటింగ్ పూర్తి
యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆర్.వి.ఫిల్మ్ హౌస్‌ను స్టార్ట్ చేసి నిర్మాతగా మారారు. అందులో భాగంగా శ్రీనివాస్ వసంతల అనే యంగ్ డైరెక్టర్‌ను పరిచయం చేస్తూ ‘కొక్కోరొకో’ అనే యాంథాలజీని రూపొందించారు. ఐదు విభిన్నమైన పాత్రల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. సినీ పరిశ్రమకు యంగ్ టాలెంట్‌ను పరిచయం చేయాలనే లక్ష్యంతో రమేష్ వర్మ...శ్రీనివాస్ వసంతల స్టోరీ టెల్లింగ్ సామర్థాన్ని గుర్తించి అతనికి కొక్కోరొకో సినిమాను తెరకెక్కించే ప్రతిష్టాత్మకమైన బాధ్యతను అప్పగించారు. ‘కొక్కోరొకో’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ డిఫరెంట్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. వినూత్న ఆలోనలతో డైరెక్టర్ శ్రీనివాస్ వసంతల.. విజువల్ గ్రాండియర్‌గా, బలమైన ఎమోషన్స్ కలగలిపి కొక్కోరొకో సినిమాతో ప్రేక్షకులకు…
