ఎర్రచీర’ట్రైలర్లోని షాట్ను ‘భూత్ బంగ్లా’ సినిమాలో కాపీ కొట్టారు: సుమన్ బాబు
ఫిబ్రవరి 6న ఎర్రచీర గ్రాండ్ రిలీజ్.. ‘బీ,సీ సెంటర్స్లో ఆడియన్స్కు బంపర్ ఆఫర్ ప్రకటించిన మూవీ టీమ్ బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా విడుదలకు సమీపిస్తున్న సందర్భంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు ప్రింట్, వెబ్…
