శ్రీ విజయ వారాహి మూవీస్ ప్రొడక్షన్ 1 గ్రాండ్ లాంచ్
ఆర్యా హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయ భారతి కెమరా స్విచాన్ చేయగా, నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందజేశారు. మూవీ యూనిట్ అందరూ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. రధన్ మ్యూజిక్ అందిస్తుండగా, రామ్ కె మహేష్ డీవోపీ, నార్నీ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్, అనిల్…
