డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ప్రారంభం
▪️దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలు.. ▪️దర్శకుడిగా శశాంక్ దువ్వూరు పరిచయం.. ▪️రొమాన్స్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు ఆసక్తికర కథాంశం హైదరాబాద్: డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న తొలి చిత్రం ‘ప్రొడక్షన్ నంబర్ 1’ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ దామోదర్ నేరేళ్ల తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశాంక్ దువ్వూరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి శివతేజ, భాస్కర్ పరమాత్ముని, సుబ్రహ్మణ్యం అల ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, నేహా పఠాన్ కథానాయికగా కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ, కుటుంబ అనుబంధాలతో పాటు సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవిస్తూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. డ్రీమ్ ప్రాజెక్టుగా సినిమా…
