బర్క్‌లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్కూల్ ఎన్‌సెంబల్ ఎక్సెలన్స్ అవార్డును ఎంపికైన సుకృతి వేణి బండ్రెడ్డి!
పుష్ప, పుష్ప-2 చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొంది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఘనత పొందిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుకుమార్ బాటలోనే ఆయన తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా విభిన్న బాటలో పయనిస్తున్నారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను అవార్డు సాధించిన సుకృతి వేణి ఇప్పుడు మరో అరుదైన ఘనతను కైవసం చేసుకుంది. అమెరికాలోని బోస్టన్‌లో ఉండే అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్కూల్‌లో సంగీత విభాగంలో ఎన్‌సెంబల్ ఎక్సెలన్స్ అవార్డును ఎంపికై ఫుల్ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. Boston లోని Berklee College…
