ఘనంగా ఎర్రచీర థ్యాంక్స్ మీట్, యాక్టింగ్ క్వీన్ కారుణ్య చౌదరి బర్త్ డే సెలబ్రేషన్స్
నేటి సినిమాల్లో హారర్ జోనర్ అంటే కేవలం దెయ్యం పగ తీర్చుకోవడం అనే మూస ధోరణి కనిపిస్తుంది. కానీ, దానికి "మదర్ సెంటిమెంట్" అనే అరుదైన ఎమోషన్‌ను జోడించి, ఒక యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు క్రియేటివ్ స్టార్ సుమన్ బాబు తెరకెక్కించిన చిత్రం 'ఎర్రచీర-ది బిగినింగ్'. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు…
