‘రోమియో జూలియట్’ నవంబర్ 13న రిలీజ్
హర్షిత్, విశాఖ ధిమాన్ జంటగా నటిస్తున్న ‘రోమియో జూలియట్’ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ సమర్పిస్తుండగా, నవరస ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుందీప్ ఎన్, వెంకటేశ్వరరావు చల్లగుళ్ల నిర్మిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘రోమియో జూలియట్’ నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ రొమాన్స్, యాక్షన్ అంశాల కలయికతో ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో హర్షిత్ సన్‌గ్లాసెస్ ధరించి, చేతిలో గన్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. విశాఖ ధిమాన్ ఎరుపు రంగు దుస్తుల్లో అందంగా కనిపిస్తున్నారు. చుట్టూ ముళ్ల తీగలు, ఎర్ర గులాబీలు, గాలిలో ఎగురుతున్న పూలరేకులు కనిపిస్తున్నాయి. బుల్లెట్లు పోస్టర్‌కు…
