రోషన్ ‘ఛాంపియన్’ టీజర్ రిలీజ్
యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్'తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్బస్టర్లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్. ఇప్పటికే విడుదలైన రోషన్, అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఆర్మీ మాన్, ఫుట్‌బాలర్ మైఖేల్ సీ. విలియమ్స్. మైదానంలో ప్రత్యర్థులను సవాలు చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించే ఈ యంగ్‌మ్యాన్‌కి ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది…
