పవర్, న్యాయం మధ్య పోరాటాన్ని తెలిపే ‘SYSTEM’ ట్రైలర్ విడుదల
ప్రైమ్ వీడియో తమ కొత్త ప్రైమ్ ఒరిజినల్ సినిమా SYSTEM ట్రైలర్‌ను విడుదల చేసింది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 22 నుంచి ప్రైమ్ వీడియో లో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్లో నేహా అనే యువ లాయర్ పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించారు. తన తండ్రిలా ఫర్మ్‌లో పార్ట్నర్ కావాలని ఆశపడే ఆమె, తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో…
