Skip to content

ఆహా’లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో చేస్తుండటం గర్వంగా ఉంది – సీజన్ 4 స్క్రీనింగ్, గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ టాలెంట్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో చూడొచ్చు. ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో సింగర్ సమీరా…

Read more

బాక్సాఫీస్ నిజమైన ‘ఓజీ’ తిరిగి వచ్చాడు

ఇంకా ట్రైలర్‌ కూడా విడుదల కాకముందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం 'ఓజీ' ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు 'ఓజీ' తుఫానుతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఓజాస్‌ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు…

Read more

అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను – నందమూరి బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ…

Read more

సీజన్ 4తో వచ్చేసిన ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా వారి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రారంభమయ్యింది. గత మూడు సీజన్లగా సరికొత్త టాలెంట్ ను సంగీత ప్రియులకు, ప్రేక్షకులకు పరిచయం చేస్తు వస్తున్న ఈ టాలెంటెడ్ సింగింగ్ షో మరోసారి గల్లీ వాయిస్ ని గ్లోబల్ లెవెల్లో వినిపించడానికి సిద్ధమైంది. ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా గత మూడు సీజన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. తాజాగా వస్తున్న సీజన్ 4 లో మోర్ ఫన్ ఇచ్చేందుకు ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ ను శ్రీరామ్ చంద్రకు కో హోస్ట్ గా తీసుకొచ్చారు. షోకు సంబంధించి టాలెంట్…

Read more

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. "రాజా సాబ్" మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను…

Read more

‘ఓజీ’ చిత్రం నుండి ‘కన్మణి’గా ప్రియాంక అరుల్ మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్‌ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు. 'ఓజీ' రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక…

Read more

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్‌ గంభీరగా అలరించనున్న చిత్రం 'ఓజీ' (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఓజీ' చిత్రం నుంచి మొదటి గీతం 'ఫైర్‌ స్టార్మ్' విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఓజీ' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు…

Read more

తెలుసు కదా నుంచి మల్లిక గంధ లాంచ్

-మల్లారెడ్డి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన 'తెలుసు కదా' మూవీ టీం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా తెలుసు కదా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ - మల్లికా గంధను లాంచ్ చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. మల్లికా గంధ లవ్ అండ్ మ్యూజికల్ మ్యాజిక్ తో మనసును తాకే అద్భుతమైన పాట. ట్యూన్, విజువల్స్ ప్రతీదీ ప్రేమ భావోద్వేగాలను బ్యూటీఫుల్ గా ప్రజెంట్ చేస్తోంది…

Read more

తలసేమియా రన్‌ను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు: నారా భువనేశ్వరి

ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తలసేమియాపై అవగాహన కోసం రన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మ్యానేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ప్రారభించారు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్ ని విజయవంతం చేశారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని సత్కరించారు. అనంతరం గ్రాండ్ మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌…

Read more