రామ్ చరణ్ ‘పెద్ది’ సెట్స్‌ను సందర్శించిన భారత క్రికెటర్ తిలక్ వర్మ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోఎస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన భారత క్రికెటర్ తిలక్ వర్మ సెట్‌ను ప్రత్యేకంగా సందర్శించడంతో ఈ సినిమాపై ఎక్సయిట్మెంట్ మరింతగా పెరిగింది. భారతదేశం సాధించిన ప్రపంచ విజయానందంలో ఉన్న తిలక్ వర్మ పెద్ది షూటింగ్ లొకేషన్‌కి వచ్చి టీమ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రావడంతో ఆ రోజు సెట్స్‌లో సెలబ్రేషన్ వాతావరణం కనిపించింది. తిలక్ వర్మను టీమ్ ఆత్మీయంగా స్వాగతించింది. సెట్స్ మొత్తం తిరిగి చూసిన ఆయన, ముఖ్యంగా స్పోర్ట్స్ యాక్షన్ సన్నివేశాలను లైవ్‌గా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. యాక్షన్…
