Skip to content

అక్టోబర్ 10న రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన ‘శశివదనే’ భారీ ఎత్తున విడుదల

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్ల మీద అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మించిన చిత్రం ‘శశివదనే’. ఈ మూవీకి సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించిన ‘శశివదనే’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు సోమవారం నాడు ప్రకటించారు. ‘శశివదనే’ చిత్రాన్ని దసరా సీజన్‌లో అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ఈ మూవీకి శ్రీ సాయి కుమార్ దారా అందించిన విజువల్స్, శరవణ వాసుదేవన్ ఇచ్చిన సంగీతం…

Read more

ఆనందం, ఆహ్లాదం కలిపిన వైభోగం… అసలైన ప్రతిభకు పట్టాభిషేకం..

అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు, మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, డా. మోహన్ బాబు మంచు, విష్ణు మంచు, మాలశ్రీ, బాబు మోహన్ గారు, మొదలైన వారు హాజరయ్యారు. వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారికి ఘన సన్మానం చేయడం జరిగింది. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే డా. మోహన్ బాబు మంచు, విష్ణు…

Read more

“సినిమా ఆగితే పస్తులతో పడుకోవాల్సిందే” – దర్శకుడు వి.ఎన్. ఆదిత్య

ఒక్క వ్యక్తి సినిమాల్లోకి వచ్చి, డబ్బులొస్తేనే తీస్తాను, రాకపోతే వేరే వ్యాపారం లో పెడతాను అనుకోకుండా, లాభమొచ్చినా సినిమాలే తీస్తూ, నష్టమొచ్చినా సినిమాలే తీస్తూ తన బయటి వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగం మీదకే మళ్లిస్తూ ఈ రంగం లో పదేళ్ల లో దాదాపు వెయ్యికోట్ల పైగా పెట్టుబడి పెట్టుకుని, ఫ్లాపుల్ని, ట్రోలింగులని ఎదురీదుతూ మొండిగా తట్టుకుని నిలబడితే.. ఆయన్ని ఎంకరేజ్ చేసి మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాల్సింది పోయి, అబద్ధపు ప్రచారాలతో, స్వార్ధపూరిత రాజకీయాలతో, కుల వివక్షలతో ఈ రంగం మీద పెట్టుబడిని బయటి రంగాలకి మళ్లించేలా మన ప్రవర్తన ఉంటే ఎవడికిరా నష్టం.. యాభై సినిమాలకు రెండొందల మందికి పైగా పదేళ్ల లో ఆయన పెట్టిన…

Read more

జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న “బేబి” మూవీ టీమ్ ను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న "బేబి" సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు జుబ్లీహిల్స్ లోని తన నివాసంలో "బేబి" సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు. తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్…

Read more

ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్ కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్, “మంజుమ్మెల్ బాయ్స్” ఫేం డైరెక్టర్ చిదంబరం కాంబో మూవీ “బాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి "బాలన్" అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కేవీఎన్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోంది. తెస్పియన్ ఫిలింస్ తో కలిసి తాము ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నామని,…

Read more

ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్ రియాలిటీ షో.. ‘షో టైం’ సినిమా తీద్దాం రండీ

ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. 'షో టైం' సినిమా తీద్దాం రండి అనే ఉపశీర్షికతో ఒక రియాల్టీ షో ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో…

Read more

విజయ రామరాజు, విక్రాంత్ రుద్ర, శ్రీని గుబ్బల స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ పవర్ ఫుల్ యాంథమ్ రిలీజ్

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ అర్జున్ చక్రవర్తి యాంథమ్ రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ ఈ సాంగ్ ని పవర్ ఫుల్ కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ స్ఫూర్తిదాయకంగా వున్నాయి. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్ , విఘ్నేష్ పాయ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ కట్టిపడేశారు. ఈ సాంగ్ లో విజయరామరాజు ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్న విజువల్స్, వండర్ ఫుల్ లోకేషన్స్…

Read more

రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" చిత్రంలో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ బర్త్ డే విశెస్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో దేవుడిని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్ స్టిల్ ఆకట్టుకుంటోంది. కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన "రాజా సాబ్" టీజర్ లో నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఈ మూవీలో నిధి అగర్వాల్ అందంతో పాటు నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది. "రాజా సాబ్" మూవీ తన కెరీర్ కు ఎంతో ప్రత్యేకంగా భావిస్తోంది నిధి అగర్వాల్. ఈ సినిమాతో తాను…

Read more

అమెరికాలో 43వ ‘ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్’ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేసిన హీరో విజయ్ దేవరకొండ

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా పాల్గొని సందడి చేశారు హీరో విజయ్ దేవరకొండ. మాడిసన్ అవెన్యూలో సర్వే భవంతు సుఖినః అనే థీమ్‌తో జరిగిన పరేడ్ వేడుకలకు గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించారు. ఈ వేడుకల్లో స్థానిక అమెరికన్స్ తో పాటు భారీ సంఖ్యలో అమెరికాలోని ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మన జాతీయ జెండాలోని మూడు రంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మువ్వన్నెల లైటింగ్ ను విజయ్ దేవరకొండ స్విచ్ఛాన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్…

Read more

సుందరకాండ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ హీరో నారా రోహిత్

హీరో నారా రోహిత్ మైల్ స్టోన్ 20వ మూవీ 'సుందరకాండ'. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. టీజర్, పాటలు, ట్రైలర్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుందరకాండ ట్రైలర్, సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి ఈ సినిమాను చూడొచ్చు. సినిమా మొదలైనప్పుడు ఎంత…

Read more