‘రామాయణం’ మ్యూజికల్ జర్నీ ప్రారంభం.. శ్రీరాముడి భక్తి భావాన్ని చాటే ‘జై జై రామ్’ రిలీజ్
‘రామాయణం’ మేకర్స్ ఈ చిత్రంలోని తొలి పాట ‘జై జై రామ్’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించగా దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ప్రతిబింబిస్తుంది. పదే పదే వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ ఈ పాటకు భక్తి భావాన్ని అందిస్తుంది. ఫిల్మ్‌మేకర్, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ: “శ్రీరాముడు ‘రామాయణం’కు హృదయం. తరతరాలుగా జీవితంలోని ప్రతి దశలో మనం ఆయనను మార్గదర్శిగా…
