‘ఛాంపియన్’ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ బ్యూటీఫుల్ గ్లింప్స్ రిలీజ్
యంగ్ హీరో రోషన్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా'ఛాంపియన్'తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథల ఎంపికలో, ప్రతిసారీ బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో స్వప్న సినిమాస్ వెరీ స్పెషల్. ఫస్ట్-లుక్ పోస్టర్లు, టీజర్‌తో సంచలనం సృష్టించిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ గ్లింప్స్ ద్వారా సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. టీజర్ ప్రేక్షకులను మైఖేల్ సి విలియమ్స్ వరల్డ్ ని పరిచయం చేయగా, ఫస్ట్ సింగిల్- గిర గిర గింగిరాగిరే ప్రోమో అనస్వర రాజన్ పోషించిన చంద్రకళని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. గ్లింప్స్‌లో చంద్రకళని ఓ ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయిగా పరిచయం…
