‘పెద్ది’ బ్రహ్మాండంగా రన్ అవుతోంది. బుధవారం నుంచి కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నాం: బుచ్చిబాబు సానా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి ప్రెస్ మీట్…
