మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రక్త చరిత్ర 2’ చిత్రం 2010లో విడుదలైన సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో చక్కటి ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్టు 1న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. అప్పట్లో ఎలాంటి ఒత్తిడులు, భయాలకు లొంగకుండా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. నటీనటులు తమ, తమ పాత్రలలో ఒదిగిపోయిన విధానం, రామ్ గోపాల్ వర్మ టేకింగ్ , అప్పట్లో ఆయన ఉపయోగించిన లేటెస్ట్ టెక్నాలజీ ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచాయి. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్తచరిత్ర అంటూ సాగే నేపథ్య గీతంతో పాటు కత్తులతో సావాసం నెత్తుటితో సమాప్తం అనే మరో పాటతో కలుపుకుని కథానుసారం, సందర్భానుసారమైన రెండు పాటలు ఇందులో ఉన్నాయి. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయమని చాలా రోజులుగా ప్రేక్షకులు కోరుతుండటంతో పాటు నేటితరం యూత్ కు కూడా వాస్తవిక కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో రామ్ గోపాల్ వర్మ రీ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
రక్త చరిత్ర పార్ట్ 1 ఇటీవల రీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది, రామ్ గోపాల్ వర్మ ఇమేజ్ తో ఈ సినిమా హౌస్ ఫుల్ అయ్యాయి, అదే తరహాలో వంకాయపాటి మురళీకృష్ణ, నట్టి లక్ష్మి కరుణ, నట్టి క్రాంతి
నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్వీటీ ఎంటర్టైన్మెంట్స్, త్రిపుర క్రియేషన్స్ లో రక్త చరిత్ర 2 ను ఆగష్టు 1న రీ రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమా కూడా పార్ట్ 1 తరహాలోనే పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, సూర్య పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన రక్త చరిత్ర 2 ట్రైలర్ కు మంచి ఆధరణ లభిస్తోంది.
Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.