Skip to content

కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్‌ విడుదల

విధేయతతో నిర్మించబడిన ఒక సామ్రాజ్యం.. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఒక వారసత్వం.. వీటన్నింటినీ నాశనం చేసే ప్రమాదం ఉన్న ఒక తీవ్రమైన ప్రత్యర్థిత్వం! అధికారం, వారసత్వం, ప్రతీకారం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరితమైన గ్యాంగ్‌స్టర్ కథా సిరీస్ ‘అక్క’ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. YRF ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. మహిళలే అధికారాన్ని శాసిస్తూ, తమ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడే ఒక విభిన్నమైన ప్రపంచాన్ని ఈ సిరీస్ ఆవిష్కరించనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. పెర్నూరు అనే రాజ్యం, అక్కడి శక్తివంతమైన వంశాల చుట్టూ…

Read more

రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర 2’ ట్రయిల్ విడుదల

మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద శత్రువులైన రెండు వేర్వేరు గ్రూపులు అయిన పరిటాల రవి, మద్దెల చెరువు సూరిలకు సంబంధించిన యథార్థ ఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర 2' చిత్రం 2010లో విడుదలైన సంగతి తెలిసిందే. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో చక్కటి ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగష్టు 1న ఈ చిత్రం…

Read more

నా కెరీర్ లో ప్రత్యేకమైన సినిమా ఇది – రాంగోపాల్ వర్మ

-రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో రామ్ గోపాల్ వర్మ "రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ చేసిన తర్వాతే ఈ సినిమాను మొదలుపెట్టాం. నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా ఇది" అని సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా 2010లో విడుదలై, అప్పట్లో సూపర్ హిట్ అయింది. 16 ఏళ్ల తర్వాత ఈ సినిమాను త్రిపుర క్రియేషన్స్ అధినేత మురళీకృష్ణ వంకాయలపాటి, నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటెర్టైనెంట్స్ తరపున నట్టి కుమార్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ…

Read more