ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా: నట్టి కుమార్
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమం, శ్రేయస్సు కోసం ఎనలేని కృషి చేస్తానని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్యానెల్ తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా నట్టి కుమార్ ట్రెజరర్ పోస్ట్ కు పోటీ చేస్తుండగా...ఆయన తనయుడు నట్టి క్రాంతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని తన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ, కౌన్సిల్ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీకి నిలబడ్డాయని, అయితే ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను తాను చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు…
