సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ‘డేంజర్’ అంటూ డ్రగ్స్‌పై హీరో కృష్ణసాయి పోరాటం
▪ ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో పాట ▪ డ్రగ్స్‌పై ప్రచార చిత్రాలకు గవర్నర్లతో పాటు పోలీసు ఆఫీసర్‌ల ప్రశంసలు ▪ డ్రగ్స్‌పై యువతకు అవగాహన కల్పించేందుకు సినిమా కూడా ▪ ‘డేంజర్’ మూవీపై హీరో కృష్ణసాయి స్పెషల్ అనౌన్స్‌మెంట్ హైదరాబాద్: విద్యార్థులు గంజాయి కోరల్లో చిక్కుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన వారి బ్యాగుల్లో మాదక ద్రవ్యాలు దర్శనమిస్తున్నాయి. డిగ్రీలు పూర్తి చేయకముందే డ్రగ్స్ కి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు చేయాల్సిన వయసులో మత్తు అనే ఊబిలో కూరుకు పోతున్నారు. ఇదేంటని అడిగిన తల్లిదండ్రులపై దాడులు చేసే పశు ప్రవర్తనలకు దిగజారి పోతున్నారు. ప్రశ్నించిన వారిపై పగ పెంచుకుంటున్నారు. మత్తుకు బానిసై ముఠాగా ఏర్పడి విక్రయాలు…
