నారి నారి నడుమ మురారి కంటెంట్ చాలా ఫన్ ఫుల్ గా ఉంటుంది: డైరెక్టర్ రామ్ అబ్బరాజు
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ అబ్బరాజు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. సంక్రాంతి వైబ్ కనిపిస్తుంది.. సంక్రాంతి కోసమే తీసిన సినిమానా ఇది? -ఇది పండగ లాంటి సినిమానే. కాకపోతే శర్వా గారి బైకర్ సినిమా విడుదల…
