జూలై 31న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ విడుదల
అదిరిపోయే యాక్షన్ ప్రోమోతో కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్‌డమ్’ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ‘కింగ్‌డమ్’ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా…
