హెల్త్ క్యాంప్ నిర్వహించిన ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి విష్ణు మంచు ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తరువాత ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన సంగతి తెలిసిందే
‘మా’ సభ్యుల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్‌లను విష్ణు మంచు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిటీలోని పెద్ద మల్టీస్పెషాల్టీ హాస్పిటల్స్‌తో కలిసి హెల్త్ క్యాంప్‌లను నిర్వహించారు. ఇక ఈ హెల్త్ క్యాంప్‌లో ‘మా’ సభ్యులంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఇక ఈక్రమంలో ఆదివారం నాడు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యుల కోసం విష్ణు మంచు హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ప్రెసిడెంట్ విష్ణు మంచు, ‘మా’ ట్రెజరర్ శివ బాలాజీ, రాజీవ్ కనకాల వంటి వారు పాల్గొన్నారు. ఇక హాస్పిటల్ తరుపున కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీఓఓ సుధాకర్ జాదవ్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డా. నవ వికాస్…
