నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్ లుక్ రిలీజ్
విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'నాగబంధం'. ఈ చిత్రం పాన్-ఇండియాలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో టీం ప్రమోషన్‌లను ముమ్మరం చేసింది. ఫస్ట్-లుక్ పోస్టర్లు ఇప్పటికే సంచలనాన్ని సృష్టించాయి. ఈ చిత్ర టీజర్‌ను రేపు మహా శివరాత్రి శుభ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. టీజర్ మీడియా ప్రీమియర్ ఇప్పటికే జరిగింది. విజువల్స్, స్టొరీ టెల్లింగ్, వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రోజు మేకర్స్, KGF ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తూ ఆయన పాత్ర బైరాగిని పరిచయం చేశారు. బూడిదతో అలంకరించిన శరీరం, జటలతో కూడిన ఆతన లుక్ మిస్టికల్ టచ్ ఇచ్చింది…
